ఇప్పటివరకు 2,500 మంది వైద్య సిబ్బందికి కరోనా


కోవిడ్‌–19 బాధితుల సేవ లో ఉన్నవారినీ కరోనా వదలడంలేదు. డాక్ట ర్లు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా నిలోఫర్‌ ఆసుపత్రిలో పనిచేసే ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని గాంధీ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందు తూ మరణించడంతో వారిలో తీవ్ర భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. తాము వైరస్‌ బాధితులకు చికిత్స చేస్తున్నందున ఎక్కువగా ప్రభావితం అవుతున్నామని, ప్రభుత్వం తమ కు సాయం చేయాలని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వేడుకుంటున్నారు. కరోనా పోరాటంలో అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పిస్తూ బుధవారం రాత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. అందని కేంద్ర బీమా సాయం... కరోనాతో చనిపోయిన ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం బీమా కల్పించింది. ఆ బీమా కింద చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల బీమా అందిం చాలి. అయితే ఇప్పటివరకు 12 మంది చనిపోతే ఒక్కరికి కూడా ఆ స్కీం కింద బీమా సొమ్ము అందలేదని వైద్య సంఘాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చనిపోయిన ఇద్దరు నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షలు మంజూరయ్యాయని, అయితే వారి చేతికి ఇంకా డబ్బు అందలేదని చెబుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బీమా సంస్థ అనేక కొర్రీలు పెడుతుందని వైద్య సంఘాలు అంటు న్నాయి. కరోనాతో చనిపోయినవారిలో ఎవరికైనా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయా అన్న విషయంలో మెలిక పెడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అటువంటివారికి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆ సంఘాలనేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కరోనా బీమా నిబంధనల్లో అటువంటి షరతు ఏమీ లేదంటున్నారు. వైరస్‌ నియంత్రణ విధుల్లో ఉంటూ ప్రమాదవశాత్తు చనిపోయి నా బీమా సొమ్ము ఇవ్వాలన్న నిబంధన ఉన్న ట్లు చెబుతున్నారు. కానీ, మెలికల వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చనిపోయే వైద్య సిబ్బంది వివరాలు లేకపోవడంతో ఆయా కుటుంబాలకు ఎటువంటి సాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.