ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.33

కోవిడ్‌–19 చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని హైదరాబాద్‌ కంపెనీ ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అత్యంత చౌకగా విక్రయిస్తోంది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను రూ.33గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్‌ను సొంత పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రూపొందించామని ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ సీఎండీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నాణ్యమైన మందులు అందరికీ చవకగా అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కంపెనీ కోవిడ్‌–19 చికిత్సలో వాడే ఓసెల్టామివిర్‌ 75 ఎంజీ క్యాప్సూల్స్‌ను ప్రవేశపెట్టింది.