45 పాయింట్లు ప్లస్‌- 38,844కు చేరిన సెన్సెక్స్‌

తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 45 పాయింట్లు పుంజుకుని 38,844 వద్ద నిలిచింది. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. అయితే విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలి సెషన్‌లోనే సెన్సెక్స్‌ సాంకేతికంగా కీలకమైన 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు నష్దాల బాట పట్టింది. వెరసి 38,680 దిగువన కనిష్టానికి చేరింది. మరోవైపు నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,526 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,423 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. ఆగస్ట్ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు ముందున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టినట్లు నిపుణులు తెలియజేశారు. ఆటో, మీడియా అప్ ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1.2 శాతం బలపడగా.. ఆటో, మీడియా 0.35 శాతం స్థాయిలో లాభపడ్డాయి. రియల్టీ 2.2 శాతం డీలాపడగా.. మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ 0.8-0.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, యాక్సిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టైటన్‌ 5.3-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గెయిల్‌, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌‌, శ్రీ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే, అదానీ పోర్ట్స్‌, విప్రో, యూపీఎల్‌, హీరో మోటో, ఇన్ఫోసిస్‌ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్‌ జోరు ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 21 శాతం దూసుకెళ్లగా.. మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, చోళమండలం, టాటా కెమ్‌, హావెల్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, సన్‌ టీవీ 13-2.3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క బీహెచ్‌ఈఎల్‌, పేజ్‌, జిందాల్‌ స్టీల్‌, ఎంజీఎల్‌, బీఈఎల్‌, నాల్కో, కేడిలా హెల్త్‌, ఎన్‌ఎండీసీ, సెంచురీ టెక్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, అపోలో టైర్‌, బాటా, జీఎంఆర్‌ 2.5-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.5 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1353 లాభపడగా.. 1474 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 219 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.