బిగ్‌బాస్‌–4కు రెడీ అవుతున్న కమల్

టీవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన బుల్లితెర కార్యక్రమాల్లో బిగ్‌బాస్‌ రియాల్టీ షో మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఎవరూ కాదనలేని అంశం. విశ్వనటుడుడ కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా అలరించిన ఈ రియాల్టీ షో విజయవంతంగా  మూడు సీజన్లు పూర్తి చేసుకుంది.  షో నాలుగో సీజన్‌ ప్రసారం ఇప్పటికే మొదలై ఉండాల్సింది. కరోనాతో ఈ ఏడాది షో ఉంటుందా ? లేదా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. అయితే షో నిర్వాహకులు బిగ్‌బాస్‌ అభిమానులకు శుభవార్త అందించారు. నాలుగో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతోందని చెప్పేశారు. దీనికి వ్యాఖ్యాతగా కమలహాసన్‌ వ్యవహరించనున్నారు. ప్రభుత్వ నిబంధనలతో పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ సారి షోలో నటి సునైనా, రమ్య పాండియన్, అతుల్యా రవి, కిరణ్, విద్యుల్లేఖ రామన్, కోమలి చిత్ర ప్రేమ్‌ శివంగి, ఇర్ఫాన్‌ ఈ సారి బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేయబోతున్నారట. అధికారిక ప్రకటన త్వరలో అయ్యే అవకాశం ఉంది.  సెప్టెంబర్‌ చివరి వారంలో ప్రసారం అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.