వైరస్‌ బారినపడి ఏఆర్‌ డీఎస్పీ మృతి

మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్‌ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పీఎస్‌.శశిధర్‌ (50) మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1996 బ్యాచ్‌ ఆర్‌ఎస్సైగా పోలీసు శాఖలో చేరిన ఆయన బెల్లంపల్లి హెడ్‌ క్వార్టర్స్, కరీంనగర్, సిరిసిల్లలో పనిచేశాక పదోన్నతిపై డీఎస్పీగా మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయానికి 2019 ఫిబ్రవరి నెలలో వచ్చారు. కాగా, శశిధర్‌ మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎస్పీ కోటిరెడ్డి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.