జేసీని అనంతపురం త్రీటౌన్‌ పీఎస్‌కు తీసుకువచ్చిన పోలీసులు

అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనంతపురం జిల్లా పోలీసులు విచారించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీని ఆదివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని అనంతపురం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు 4 గంటల పాటు జేసీని విచారించారు.
అనంతరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చి, కడప కేంద్ర కారాగారానికి తిరిగి తరలించారు. ఈ నెల 6న విధుల్లో ఉన్న దళిత పోలీసు అధికారిని దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.