సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్‌ పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సంఘ మిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.  మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. జూమ్‌ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, హీరో మహేష్‌బాబు,ఆయన సతీమణి నమ్రత పాల్గొన్నారు. బాధితులకు, పోలీసులకు వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు పనిచేయనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ సేవలందిస్తుంది.