బంగారు దుకాణంపై కేసు నమోదు చేస్తున్న ఎంహెచ్‌ఓ

నగరంలో జాయ్‌అలుకస్, మలబార్‌గోల్డ్‌ జ్యువెలరీ నిర్వాహకులు కోవిడ్‌–19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా తెరవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్‌–19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు నగర పాలక సంస్థ ప్రజారోగ్యం అధికారి డాక్టర్‌ రాజేష్‌ తనిఖీలో తేలింది. దీంతో సదరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎంహెచ్‌ఓ తెలిపారు. భౌతికదూరం పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.