కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..

ఉత్తర కోస్తా ఒరిస్సా, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 9.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
  • అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు.. నేడు, రేపు అనేక చోట్ల.. ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రేపు(ఆదివారం) ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ  వర్షాలు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిది.