తమ పార్టీ నేత మంచాన పడినా పట్టించుకోని టీడీపీ నేతలు


కాకినాడ జగన్నాథపురం గొల్లపేటకు చెందిన పుట్టా ఆదిబాబు (ఆదినారాయణ) రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నాడు. మాజీ మంత్రి యనమల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పయనిస్తూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చాడు. జిల్లా టీడీపీ కార్యదర్శిగా, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా, తెలుగుయువత కార్యదర్శిగా టీడీపీలో అనేక పదవులు చేశాడు. ఇలా పార్టీ కోసం పాటుపడుతూ.. అకస్మాత్తుగా దాదాపు రెండున్నరేళ్ల క్రితం సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలూ పాడయ్యాయని, ఎంతోకాలం బతకడం కష్టం అన్నారు. ముఖం చాటేసిన టీడీపీ రెండు దశాబ్దాలకు పైగా పడ్డ కష్టానికి తనను తెలుగుదేశం పార్టీ తనను ఆదుకొంటుందని ఆశపడ్డ పుట్టి ఆదిబాబుకు నిరాశే ఎదురైంది. నమ్ముకొన్న నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. సదరు నేతలు ముఖం చాటేసి నిర్లక్ష్యం చేయడంతో జీవితంపై ఆదిబాబు ఆశలు వదులుకొన్నారు.