అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై మంత్రుల సమీక్ష

125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, విశ్వరూప్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనులను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అదే విధంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని మొదటగా స్వాధీనం చేసుకోవాలని మంత్రి సురేష్ అధి​కారులకు ఆదేశించారు.