కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్‌

ప్రస్తుతం బయోపిక్‌ ట్రెండు నడుస్తోంది. పలువురు ప్రముఖుల బయోపిక్‌లతో పొందిన చిత్రాలు ప్రజాదరణ పొందుతున్నాయి.  జయలలిత జీవిత చరిత్రతో తలైవీ, ది ఐరన్‌ లేడీ చిత్రాలు నిర్మాణాల్లో ఉన్నాయి. త్వరలో మరో ప్రముఖ క్రీడాకారిణి జీవిత చరిత్ర  సినిమాగా రూపొందబోతోంది. వెయిట్‌ లిఫ్ట్‌లో ప్రపంచ స్థాయిలో కాంస్యం పథకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనుందని సమాచారం.