‘ఒకే ఒక్క తప్పుతో వరల్డ్‌కప్‌ చేజార్చుకున్నాం’

వన్డే వరల్డ్‌కప్‌ జరిగి ఏడాది అయ్యింది. అయినా ఆ వరల్డ్‌కప్‌పై ఇప్పటికీ ఏదొక సందర్భంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మెగాటోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు ఫేవరెట్‌గా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. అప్పటికి గత కొన్నేళ్ల నుంచి టీమిండియా సాధిస్తున్న విజయాలు చూసి అంతా మనమే ఫేవరెట్‌ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే లీగ్‌ స్టేజ్‌లో గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన విరాట్‌ సేన వరల్డ్‌కప్‌ రేసులో నిలిచింది. కానీ అనుకున్నది జరగలేదు. చివరకు ఇంగ్లండ్‌ టైటిల్‌ ఎగురేసుకుపోయింది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత కివీస్‌ను బౌలర్లు కట్టడి చేసినా బ్యాటింగ్‌లో వైఫల్యంగా కారణంగా టీమిండియా సెమీస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240 పరుగుల ఛేదనలో టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో భారత్‌ 221 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది.