ఇమ్యూనిటీ బూస్టింగ్‌లోనగరవాసులు బిజీబిజీ

కరోనా ఎఫెక్ట్‌తో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎన్నెన్నో దారులు వెదుకుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)పెంచుకునేందుకు కషాయం తాగడం లాంటి వంటింటివైద్యానికి ప్రాముఖ్యతనిస్తూనే..విటమిన్స్, మినరల్స్‌ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఏ మెడికల్‌ షాపులకు భారీగా గిరాకీ పెరిగింది. కొందరు వ్యక్తిగతంగా టాబ్లెట్లు కొనుగోలు చేస్తుంటే..మరికొందరు డాక్టర్ల సలహాతో మందులువాడుతున్నారు. గత వారం రోజులుగా పలు విటమిన్స్, మినరల్స్‌కుసంబంధించిన మందుల కొరత ఏర్పడింది. మెడికల్‌ షాపుల్లోనో స్టాక్‌ అని చెప్పేస్తున్నారు.
దీన్నిబట్టి నగర జనంఏ స్థాయిలో ఈ ముందులు వాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సోమవారం ‘సాక్షి’ నగరంలోని పలు మెడికల్‌ షాపులనుసందర్శించగా..పలుఆసక్తికర విషయాలు తెలిశాయి. మెడికల్‌ షాప్‌లకు వచ్చే సుమారు వంద మంది కస్టమర్స్‌లో దాదాపు 90 మంది విటమిన్‌ సి,డితో పాటు ఇతర మినరల్‌ మాత్రలను కొనుగోలు చేయడం కన్పించింది. కొందరైతే ఇంట్లోని కుటుంబ సభ్యుల అందరి కోసం మాత్రలు కొనేశారు. వీటితో పాటు రోగ నిరోధక శక్తినిచ్చే ఇతర ఇమ్యూనిటీ బూస్టింగ్‌ పౌడర్లు, టానిక్స్, జింక్, ఐరన్, మల్టీవిటమిన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శరీరంలో అన్ని విధాలుగా శక్తి సమకూర్చడానికి ఈ రకమైనా మందులు కొంటున్నామని చెబుతున్నారు. ఇలా నగరవాసులు శరీంలో విటమిన్స్‌ను నింపేస్తున్నారు.