మన్‌దీప్‌కు కరోనా

భారత పురుషుల హాకీ జట్టులో కోవిడ్‌–19 బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. జలంధర్‌కు చెందిన ఫార్వర్డ్‌ ప్లేయర్‌ మన్‌దీప్‌ సింగ్‌ తాజాగా కరోనా బారిన పడ్డాడు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని ‘సాయ్‌’ సెంటర్‌లో జాతీయ హాకీ శిబిరం జరుగనుండగా... 25 ఏళ్ల మన్‌దీప్‌తో పాటు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్, డిఫెండర్‌ సురేందర్‌ కుమార్, జస్‌కరణ్‌ సింగ్‌ , డ్రాగ్‌ ఫ్లికర్‌ వరుణ్‌ కుమార్, గోల్‌ కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాథక్‌ పాజిటివ్‌గా తేలినట్లు సాయ్‌ తెలిపింది. వీరంతా బెంగళూరులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ‘మన్‌దీప్‌ పాజిటివ్‌గా తేలాడు. కానీ అతనిలో కరోనా సంబంధిత లక్షణాలు పెద్దగా లేవు. మిగతా ఐదుగురితో కలిపి చికిత్స అందజేస్తున్నాం’ అని సాయ్‌ తెలిపింది.