తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది: సంజయ్‌


రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లకతప్పదన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పీఆర్సీ ఇచ్చినా ఇంకా అమలు కాలేదన్నారు.