పోలీస్‌స్టేషన్‌కు ప్రొఫెసర్‌ కాశిం

ప్రొఫెసర్‌ కాశిం ఆదివారం ములుగు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విప్లవ సాహిత్యం కలిగి ఉండటం, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనపై గతంలో ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కండీషనల్‌ బెయిల్‌ పొందిన ప్రొఫెసర్‌ నిబంధనల మేరకు ములుగు పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన అరెస్టును నిరసిస్తూ విడుదలకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు కాశిం కృతజ్ఞతలు తెలిపారు.