ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదే విధంగా ప్రకాశం బ్యాకేజ్‌కి వరద నీరు పోటెత్తుతోంది. వరదకు వర్షం తోడుకావటంతో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో అరవై గెట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతు​న్నారు. ఈ సాయంత్రానికి 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావచ్చని అంచానా వేస్తున్నారు. గంటగంటకు వరద పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద పరిస్ధితిని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలిస్తూ ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంత తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో అధికారులు  కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.