గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన స్వాతంత్య్ర సమరయోధులు మునిపల్లి రామచందర్ గారు.

 

గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన స్వాతంత్య్ర సమరయోధులు మునిపల్లి రామచందర్ గారు.

-->  స్వాతంత్య్ర సమరయోధులకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల G.O లు అమలు చేసి  న్యాయం చేయాలి.- స్వాతంత్య్ర సమర యోధుల సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ.మునిపల్లి రామచందర్.

  సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో స్వాతంత్య్ర సమరయోధుల సంస్థ అధ్యక్షులు మునిపల్లి రామచందర్ గారు  పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఇట్టి తరుణంలో ఆయన మాట్లాడుతూ మేము స్వాతంత్య్రము తీసుకుని వచ్చింది రామ రాజ్యము కొరకు కానీ రాక్షస రాజ్యం కొరకు కాదు అని తెలియజేస్తూ మమ్మల్ని సన్మానాలకు మాత్రమే గుర్తించడం కాదు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జారీ చేసిన జీవోలను అమలు చేయాలని ఈ వయసులో మాకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పి పించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు అమలు చేసి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అదే విధముగ స్వాతంత్య్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంస్థ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కోవూరి సత్యనారాయణ గౌడ్ న్యాయవాది మాట్లాడుతూ భారత దేశంలో నలుమూలలా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సుఖసంతోషాలతో జరుపుకుంటున్నందుకు స్వాతంత్య్ర సమరయోధుల వారసులుగా గర్వపడుతున్నాము అని స్వాతంత్య్రము తీసుకువచ్చిన స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానించుటకు కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు గొప్ప మనసుతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుగారు జిల్లా కార్యాలయ సిబ్బంది అయిన అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, ఆర్డీవో నాగేష్ ,సదాశివపేట ఎం.ఆర్.ఓ  ఆశాజ్యోతి గార్ల చే ఇంటి వద్ద శాలువా పూలమాలలతో సన్మానించడము గర్వపడాల్సిన విషయము అని  అదే విధముగా గొప్ప మనసుతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు స్వతంత్ర సమర యోధులకు ఎటువంటి కష్టము వాటిల్లకుండా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసి న్యాయం చేకూర్చాలని మరియు స్వాతంత్య్ర సమరయోధులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిప్పి పించుకోకుండా గౌరవ  ప్రథమంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీవోలను అమలు చేసి రాబోయే తరాలలో యువతకు స్ఫూర్తినిస్తూ దేశభక్తి పెంపొందించాలని స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలని తెలియజేశారు మరియు  సంగారెడ్డి జిల్లా ప్రజలకు 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క  కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంస్థ సంగారెడ్డి జిల్లా  వైస్ ప్రెసిడెంట్ కూచని సతీష్  , ఎగ్జిక్యూటివ్ మెంబర్ కనిగెరి.కృష్ణాగౌడ్ మరియు స్వాతంత్య్ర సమరయోధుల వారసులు పాల్గొన్నారు.