భాష–హెబ్రూ.. సంప్రదాయం–యూదు

రాష్ట్రంలో యూదు జాతీయులు దాదాపు 125 కుటుంబాలున్నట్టు అంచనా. వాటిలో 40 కుటుంబాల వారు గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎఫ్రాయిమ్‌ గోత్రీకులు. వీరి పూర్వీకులు తొలుత తెలంగాణ, అమరావతిలో నివసించారు. అయితే బ్రిటిష్‌ హయాంలో వీరిలో ఒకరికి కొత్తరెడ్డిపాలెం ప్రాంతంలో ఉద్యోగం రావడంతో వీరి మకాం ఇక్కడికి మారింది. ఈ 40 కుటుంబాల్లోని 300 మంది వందల ఏళ్లుగా తెలుగు జన జీవన స్రవంతిలో కలిసి పోయినా తమ మాతృ భాష, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు.