ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ  పాలసీ ద్వైమాసిక రివ్యూను గురువారం ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో  రెండురోజుల సమావేశం అనంతరం  మానిటరీ పాలసీ కమిటీ రేటు యథాయథంగా  ఉంచేలా  ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్ద,  రివర్స్  రెపో రేటు  3.35 వద్ద యథాతథంగా ఉండనున్నాయి.