బస్సు సర్వీసులపై ఇరురాష్ట్రాల అధికారుల భేటీ

అంతరాష్ట్ర బస్‌ సర్వీసుల ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారుల సమావేశం కొనసాగుతోంది. సోమవారం హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఏపీ ఈడీ బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ ఈడీలు యాదగిరి, పురుషోత్తం నాయక్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్దరణ చర్యలు, బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తున్నారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఒప్పందం, రూపకల్పన, అమలు చేయాల్సిన విధానంపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.