పాతబస్తీలో ప్రారంభమైన బీబీ కా ఆలం ఊరేగింపు


త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపునకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ ఆంక్షలతో ఏనుగుపై కాకుండా డీసీఎం వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. యాకత్‌పురా, చార్మినార్ గుల్జార్‌హౌస్, మీరాల మండి, దారుల్‌షిఫా మీదుగా చాదర్‌ఘాట్‌ వరకు ఆలం ఊరేగింపు జరిగింది.