‘ఆస్పత్రులు మూసి వేయడం మా ఉద్దేశ్యం కాదు’

కరోనా వైరస్‌ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను  బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.  వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.కాగా, . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి.  మరిన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.