ఇంజనీర్లతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీటింగ్‌


‘పట్టణ ప్రగతి ద్వారా ఇప్పటి వరకు రూ. 32కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పాటు సీఎం ప్రత్యేక నిధుల ద్వారా ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఏయే పనులు పూర్తి చేశారు.. మిగతావి ఏ స్థాయిలో ఉన్నాయో బల్దియా ఇంజినీర్లు వెల్లడించాలి. టెండర్లు జరిగి రెండేళ్లు పూర్తయినా కొన్ని పనులు ప్రారంభించడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎందరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. ఏ వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా?’ అంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బల్దియా ఇంజనీర్లపై నిప్పులు చెరిగారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశం వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.