రియా చక్రవర్తికి భద‍్రత కల్పించనున్న పోలీసులు


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసులో రియా చక్రవర్తికి రక్షణ కల్పించాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం ముంబై పోలీసులకు లేఖ రాసింది. రియాతోపాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉన్న క్రమంలో సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డిమాండ్‌ మేరకు డీఆర్‌డీఓ అతిథి గృహం నుంచి తన ఇంటికి వెళ్లే క్రమంలో రియా చక్రవర్తికి భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. అయితే గురువారం రియా చక్రవర్తి ఇంటి ముందు మీడియా వ్యక్తులు తనను వేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలని రియా ముంబై పోలీసులను కోరారు. కొంతమంది మీడియా వ్యక్తులు తన బిల్డింగ్ కాంపౌండ్‌లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.