ఏటీఎం చోరికి యత్నించిన దుండగులు

నాచారం చౌరస్తాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు చోరికి పాల్పడుతుండగా మిషన్ లో ఉన్న సెన్సార్ ఆధారంగా చోరీ జరుగుతుందని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. ఏటీఎమ్ లో ఉన్న డబ్బును దొంగిలించడానికి దుండగులు నానా విధాలుగా ప్రయత్నం చేశారు. చోరీ చేసే యత్నంలో ఏటీఎమ్ మిషన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.