గణేశునికి తొలిపూజ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రసిద్ధ బాలాపూర్‌ గణేశున్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. గణేశునికి సబితా ఇంద్రారెడ్డి తొలి రోజు(శనివారం) పూజ చేశారు. ఆమెతో పాటు మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి పూజ చేసిన మంత్రి సబితా రెడ్డి.. ప్రజలందరిని కరోనా నుండి కాపాడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి నిర్వాహకులు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లడ్డూ వేలం రద్దు చేశారు.