బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ నియామకం

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కాషాయ దళం అదే ఊపును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కరీంనగర్‌ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ను ఇప్పటికే నూతన అధ్యక్షుడిగా నియమించింది. అనంతరం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సంజయ్‌ తన కొత్త టీమ్‌ను నియమించారు. 8 మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా, నలుగురిని ప్రధాన కర్యదర్శులుగా, మరో ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు ఆదివారం బండి సంజయ్‌ నూతన కమిటీని ప్రకటించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు
1) డా. విజయ రామారావు (మాజీ ఎమ్మెల్యే)
2) చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
3) సంకినేని వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే)
4) యెండల లక్ష్మీ నారాయణ (మాజీ ఎమ్మెల్యే)
5) ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
6) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
7) మనోహర్ రెడ్డి
8) శోభారాణి
ప్రధాన కార్యదర్శులు
 • ప్రేమేందర్‌ రెడ్డి
 • ప్రదీప్‌ కుమార్‌
 • ఎమ్‌. శ్రీనివాసులు
కార్యదర్శులు
 • రఘునందన్ రావు
 • ప్రకాష్ రెడ్డి
 • శ్రీనివాస్ గౌడ్
 • బొమ్మ జయ శ్రీ
 • పల్లె గంగారెడ్డి
 • కుంజ సత్యవతి
 • మాధవి
 • ఉమరాణి