ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,183కు


దేశ, విదేశీ మార్కెట్లలో సోమవారం పుంజుకున్న పసిడి, వెండి ధరలు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ప్రస్తుతం అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్‌ కాంగ్రెస్‌లో చర్చలు ప్రారంభంకానుండటం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలహీనపడటం వంటి అంశాలు సోమవారం పసిడి, వెండి ధరలకు బలాన్నిచ్చినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. మిశ్రమ బాట ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50 లాభపడి రూ. 50,183 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ స్వల్పంగా రూ. 98 నష్టంతో రూ. 60,298 వద్ద కదులుతోంది.