ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీకి 11,400 వద్ద పటిష్ట మద్దతు


ఆర్థిక గణాంకాలు, ఈ ఏడాది క్యూ1లో కంపెనీల ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో గడిచిన వారం మార్కెట్లు ఊగిసలాట మధ్య కదిలాయి. వీటికితోడు పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కొద్ది రోజులుగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతూ వస్తున్నాయి. మరోవైపు చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఎలా సంచరించవచ్చన్న అంశంపై పలువురు నిపుణులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటిలో కొన్నిటిని తీసుకుంటే.. 11,440 స్థాయి కీలకం కొద్ది వారాలుగా పలు ప్రతికూలతల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు నిలదొక్కుకుంటూ వచ్చాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 11,440-11,620 పాయింట్ల స్వల్ప పరిధిలోనే ఊగిసలాటకు లోనవుతూ వస్తోంది. వచ్చే వారం నిఫ్టీకి 11,440 స్థాయి కీలకమని చెప్పవచ్చు. ఈ మద్దతు స్థాయికంటే దిగువకు చేరితే 11,200 వరకూ నీరసించవచ్చు.