‘టీ 20 క్రికెట్‌లో అతడే ప్రమాదకర ఆటగాడు’


మరో ముడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2020(సెప్టెంబర్‌ 19)పై క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020కు సంబంధించి టీమ్‌ల బల బలాలపై ప్రముఖ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత టీ 20 క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు. రికీ పాంటింగ్ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మొంబై ఇండియన్స్‌లో ప్రమాదకర ఆటగాడు ఏవరనే ప్రశ్నకు సమాధానమిస్తు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అని పాంటింగ్‌ సమాధానమిచ్చాడు. రోహిత్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్ కొనసాగిస్తున్నట్లు పాంటింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా మొంబై ఇండియన్స్ 4 టైటెల్సి గెలుపొందిన విషయం తెలిసిందే.