తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు


తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 2,381 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటి వరకు 1080 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,387 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 1,50,160 మంది పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 386, రంగా రెడ్డి 227, మేడ్చల్‌ 193, నల్లగొండ 132, కరీంనగర్‌లో 119 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక, భారత్‌ లో కరోనా మరణాల రేటు 1.58% గా ఉంటే.. తెలంగాణలో 0.59 %గా ఉంది. ఇక, కరోనా రికవరీ రేటు దేశ వ్యాప్తంగా 81.71%గా ఉండగా.. తెలంగాణలో 82.67% శాతానికి పెరిగింది.