నటాషా,‌ అగస్త్య ఫోటో షేర్‌ చేసిన పాండ్యా


టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, భార్య నటాషా స్టాంకోవిచ్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్యూట్‌ జంట జూలై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కుమారుడికి అగస్త్య అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్ధిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.