'బిగ్‌బాస్‌'కు ప్రేమ‌లేఖ రాసిన న‌టి


రియాలిటీ షో బిగ్‌బాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు, హిందీ, త‌మిళం ఇలా ఏ భాష‌లో అయినా బిగ్‌బాస్ రేటింగ్‌కు తిరుగులేదు. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ల‌కు కూడా బోలెడంత పాపులారిటీని తెచ్చిపెడుతుంది. షో మొద‌లు కాకుండానే ప‌లానా వాళ్లు పాల్గొంటున్నారు. మా దగ్గ‌ర ఆ స‌మాచారం ఉందంటూ లీక్‌వీరులు చేసే లీక్స్ అన్నీ ఇన్నీ కావు. అక్టోబ‌రు3 నుంచి ప్ర‌సారం కానున్న హిందీ బిగ్‌బాస్ కోసం జ‌నాలు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షోలో ఎవ‌రెవ‌రు పాల్గొంటార‌న్న దానిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. వీటిలో టెలివిజ‌న్ న‌టి టీనా ద‌త్తా పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉంది. టీనా బిగ్‌బాస్‌లో క‌నిపించ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ ఓ సుధీర్ఘ లేఖ‌ను విడుద‌ల చేసింది.