‘నోటరీ ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి ’


లేఅవుట్, భవనాల క్రమబద్ధీకరణ పథకాల్లో ప్రభు త్వం మరికొన్ని మార్పులు చేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇళ్లు, ప్లాట్లు నోటరీల ద్వా రా క్రయవిక్రయాలు జరిగాయని, ఇది వరకు ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ చాలామంది దర ఖాస్తు చేసుకోలేకపోయారని అన్నా రు. కొందరికి తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఇదే పద్ధతిలో ఉన్నాయని, ప్రస్తుతం క్రమబద్ధీకరణ విషయంలో నోటరీ ఆస్తులపై విధానపరమైన నిర్ణయం తీసుకొని చివరి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ బిల్లుకు ఎంఐఎం పూర్తి మద్ద తు ఇస్తుందని, కానీ కొన్ని రకాల మా ర్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వీటిపై ప్రభు త్వం మరింత పక్కాగా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఇకపై వక్ఫ్‌ బోర్డు, దేవాదాయ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులను బా ధ్యులుగా చేయాలన్నారు. హైదరాబా ద్‌ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని అక్బరుద్దీన్‌ అన్నారు. రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో కేటీఆర్‌ కీలక పా త్ర పోషించారన్నారు. ఇటీవల తాను ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అభివృద్ధిని చూసి షాక్‌ అయ్యానన్నారు.