ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్‌


ప్రముఖ గాయకుడు ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో స్మారకమందిరం త్వరలో నిర్మిస్తామని కుమారుడు చరణ్‌ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎస్పీబీ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్‌రోడ్డు వద్ద వున్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహించారు.