‘పోత బిడ్డో సర్కారు దవాఖానకు అనేట్టుగా ఉంది’


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్, 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయని, కానీ ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తోందని తెలిపారు. నిరుపేదలకు ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తోందని పేర్కొన్నారు. దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.