భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తనకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తమిళ హీరో విష్ణు విశాల్ సోమవారం ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్జైన్కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు