హైదరాబాద్‌​కు భారీగా నిధులు: కేటీఆర్‌


గత ఐదు ఏళ్లుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రగతి నివేదిక గత ఐదు ఏళ్లలో తమ పని తీరుకి నిదర్శనంగా ఉండబోతుందన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.