బాలుకి కరోనా నెగిటివ్‌.. కానీ


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త.. ఆయనకు కరోనా వైరస్‌ నెగిటివ్‌ వచ్చినట్లు బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ సోమవారం తెలిపారు. కాకపోతే ఆయన ఇంకా వెంటిలేటర్‌ మీదనే ఉన్నారన్నారు. ఈ మేరకు చరణ్‌ ఒక వీడియో షేర్‌ చేశారు. ‘నాన్న గారికి కరోనా నెగిటివ్‌గా వచ్చింది. కాకపోతే ఆయన ఊపిరితితత్తుల ఇన్‌ఫెక్షన్‌ నయం కావడానికి మరి కొద్ది కాలం పడుతుంది. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాన్నగారు స్పృహలోనే ఉన్నారు. స్పందిస్తున్నారు. తన ఐప్యాడ్‌లో ఆయన టెన్నిస్‌, క్రికెట్‌ మ్యాచ్‌లను చూస్తున్నారు’ అని తెలిపారు చరణ్‌. అంతేకాక ప్రస్తుతం ఎలాంటి సెడెషన్‌ ఇవ్వటం లేదని తెలిపిన ఎస్పీ చరణ్ ఫిజియో థెరపి మాత్రం కొనసాగిస్తున్నారని వెల్లడించారు.