రసెల్‌కు బౌలింగ్‌ చేయనే చేయను..


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌కు బౌలింగ్‌ చేయడం ఇష్టం లేదంటూ ఆల్‌రౌండర్‌ సిద్దేశ్‌ లాడ్‌ కుండబద్దలు కొట్టాడు. రసెల్‌కు బౌలింగ్‌ వేయడం కంటే బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడతా అంటూ తెలిపాడు. వాస్తవానికి రసెల్‌ ఉన్న కేకేఆర్‌ జట్టులోనే సిద్ధేశ్‌ లాడ్‌ ఉండడం గమనార్హం. ఇద్దరు ఓకే జట్టులో ఉండడంతో 2020 ఐపీఎల్‌లో రసెల్‌కు బౌలింగ్‌ వేసే అవకాశం సిద్దేశ్‌కు రాదు. కానీ మ్యాచ్‌లకు ముందు కేకేఆర్‌ ప్రాక్టీస్‌ సమయంలో తమ రిజర్వ్‌ బౌలర్లతోనే నెట్స్‌లో బంతులు వేయించుకొని ప్రాక్టీస్‌ చేస్తుంటారు. ఒకవేళ రసెల్‌కు బౌలింగే చేయాల్సి వస్తే తాను అతనికి బౌలింగ్‌ వేయడానికి ఇష్టపడను.. అంతేకాదు ఇతర పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటానంటూ సిద్ధేశ్‌ తెలిపాడు.