వ్యాక్సిన్‌ వచ్చినా... రాకున్నా...


మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా సంవత్సరంపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను 2021లో ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్‌ జరగాల్సి ఉంది. ఆలోగా కరోనా పూర్తిగా తగ్గకపోయినా, దీనికి సంబంధించి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోయినా తాము మాత్రం వెనక్కి తగ్గమని ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్‌ కోట్స్‌ స్పష్టం చేశారు. కోవిడ్‌–19ను గెలిచిన క్రీడలుగా టోక్యో ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు.