ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి సెరెనా ఔట్‌!


మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ పారిస్‌లో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి గాయం కారణంగా వైదొలిగింది. ఈ విషయాన్ని రోలాండ్ గారోస్ నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. సెరెనా విలియమ్స్ క్లే కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లో మార్గరెట్ సృష్టించిన 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును అధిగమించాలనుకుంది. కానీ ఆమె బుధవారం జరగాల్సిన రెండవ రౌండ్ మ్యాచ్‌కు ముందే కాలిగాయంతో టోర్నమెంట్‌ నుంచి వైదొలిగింది.