క్రేజీ డైరెక్టర్‌తో శర్వానంద్ మహా సముద్రం‌!


ఆర్‌ ఎక్స్‌ 100 సినిమా ఎంత సూపర్‌ డూపర్‌ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమా తన మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి మంచి హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. అందరినీ ఆకట్టుకునేలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్‌ హీరో శర్వానంద్‌తో సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రణరంగం, జాను సినిమాలు ప్లాప్‌ కావడంతో శర్వానంద్‌ కొద్దిగా వెనుకబడ్డారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు మహా సముద్రం అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ డైరెక్టర్‌ శర్వానంద్‌ కోసం ఎలాంటి కథను తయారు చేశాడో తెలియాల్సివుంది.