యూవీసీ బాక్స్‌తో కరోనాకు చెక్‌


కరోనా వైరస్‌ మనం నిత్యం వాడుకునే వస్తువులపై ప్రభావం చూపకుండా అడ్డుకోవడానికి సిద్దిపేటకు చెందిన కాపర్తి భార్గవ్‌ అనే యువశాస్త్రవేత్త యూవీసీ వైరస్‌ కిల్లర్‌ మెషీన్‌ రూపొందించాడు. భార్గవ్‌ హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఇన్ఫర్మేష‌న్ టెక్నాలజీలో సెకండియర్‌ చదువుతున్నాడు. ప్రజలు కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న తీరును గమనించిన భార్గవ్‌ ఈ వైరస్‌ కిల్లర్‌ను తయారు చేశాడు. కేవలం రూ. 600 ఖర్చుతో అట్టబాక్స్, రిఫ్లెక్షన్ కవర్, థర్మకోల్, యూవీసీ (అల్ట్రా వయొలెట్‌ కాంపైజర్‌) బల్బ్, కనెక్టర్‌లతో ఈ పరికరాన్ని రూపొందించాడు. నిత్యావసర సరుకులు, బయటకు వెళ్లి వచ్చినప్పుడు మన వస్తువులను బాక్స్‌లో పది నిమిషాలుంచితే వైరస్‌ ఉన్నట్టయితే చనిపోతుంది. దీంతో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చన్నాడు. యూవీసీ కిరణాలు మన శరీరానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.