బాలు మృతిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి


సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన ఎస్పీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. బాలసుబ్రహ్మణ్యం లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సీఎం అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాలు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.