ఫెడ్‌ భేటీపై ఇన్వెస్టర్ల చూపు


బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ గోల్డ్‌ ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 రూపాయలు భారమై 52,158 రూపాయలకు చేరింది.