ఎంఎస్ ధోని గురించి కొత్తగా ఊహించుకున్న ప్రతీసారి ఏదో ఒక నిర్ణయంతో తన అభిమానులకు షాక్‌లు ఇస్తూనే ఉంటాడు. 2019లో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆఖరిసారిగా ఆడిన ధోని మళ్లీ బరిలోకి దిగలేదు. ఇంతలోనే కరోనా రావడం.. దీంతో ఐపీఎల్, టీ20 క్రికెట్లు వాయిదా పడడం ధోనిని అతని అభిమానులకు మరింత దూరం చేశాయి. అలా చూస్తుండగానే 14 నెలలు గడిచిపోయాయి. అయితే టీ20 ప్రపంచకప్‌లో ధోని ఆడుతాడని భావించిన అతని అభిమానులకు ధోని బిగ్‌షాక్ ఇచ్చాడు. అదే రిటైర్మెంట్ అనే పదం..సరిగ్గా ఆగస్టు 15 రాత్రి 7.29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు.