బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ షోలోకి వెళ్లిన 16 మంది కంటెస్టెంట్లలో దేత్తడి హారిక ఒకరు. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన హారికకు ప్రజల్లో విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. మంగళవారం హారిక పుట్టినరోజు. నిజానికి గతేడాది హారిక తన పుట్టినరోజును చిన్న పిల్లల మధ్య జరుపుకుంది. అంతే కాకుండా వారికి పండ్లు, బిస్కెట్లు కూడా పంచి పెట్టింది. ఈ ఫొటోలను నిన్న ఆమె ఆమె కుటుంబ సభ్యులు హారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఆమె చేసిన పనికి ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. ఆ ఫొటోలను ఇప్పుడే ఎందుకు బయటకు వదులుతున్నారు? అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. "చీప్ పబ్లిసిటీ స్టంట్" అని బాహాటంగానే విమర్శిస్తున్నారు.